కొల్తూరులో కాలుష్య కూపాలుగా చెరువుల
🔸రసాయన వ్యర్థాలతో చేపలు, పశువుల మృతి 🔸పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎంపీ ఈటల రాజేందర్ ఆర్.జె.న్యూస్, వెబ్ డెస్క్ : పారిశ్రామిక సంస్థల నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో కొల్తూరు గ్రామంలోని కుంటలు, చెరువులు కాలుష్య కూపాలుగా మారుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆందోళన వ్యక్తం చేశారు. కాలుష్య నీటితో చేపలు, పశువులు, జలచరాలు, పక్షులు మృత్యువాత పడుతున్నాయన్న సమాచారంతో శుక్రవారం ఆయన కొల్తూరు చెరువును సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్య తీవ్రతను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడిన...