RJNEWS TELUGU
Date of Publish : 16 July 2026, 6:26 pm Posted by : RJ NEWS TELUGU

గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రావల్‌కోల్ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకలకు పీపీఆర్ (పెస్ట్ డెస్ పెటిట్స్ రూమినెంట్స్) వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎక్కలదేవి కొమరయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ కురుమూర్తి మాట్లాడుతూ, పీపీఆర్ వ్యాధి నివారణకు ప్రతి గొర్రె, మేకకు తప్పనిసరిగా టీకా వేయించాలని, వ్యాధి నియంత్రణలో పెంపకందారులు పశుసంవర్ధక శాఖకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో వీఎల్‌వో శోభారాణి, జేవో శంకర్‌రెడ్డి, ఓఎస్‌లు శ్రీనివాస్, తిరుపతి టీకాలు వేశారు. గొర్రెలు, మేకల పెంపకందారులు రమేష్, మామిళ్ల చంద్రయ్య, బొల్లబోయిన శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.