కొంపల్లి శ్రీచైతన్య విద్యార్థికి రాష్ట్రపతి భవన్‌లో ప్రతిష్టాత్మక అవార్డు
ఆర్.జె.న్యూస్,కొంపల్లి : కొంపల్లిలోని శ్రీచైతన్య సీబీఎస్ఈ పాఠశాల విద్యార్థి రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఆల్ ఇండియా లీడ్ కార్యక్రమంలో 3వ బహుమతి సాధించి గౌరవం తెచ్చిపెట్టాడు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థుల మధ్య పోటీపడి కొంపల్లి శ్రీచైతన్య సీబీఎస్ఈ బ్రాంచ్ విద్యార్థి 3వ స్థానంలో నిలిచాడు. ఈ విజయం పాఠశాలకు, బోలారం ప్రాంతానికి గర్వకారణంగా మారింది. విద్యార్థి విజయాన్ని పురస్కరించుకుని పాఠశాలలో ప్రత్యేక అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి AGM రవి చుండూరి, CO నరేంద్ర...