ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రాధాన్యం: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్: ప్రజల సమస్యలను సత్వరం పరిష్కరించడమే జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యమని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) విజయేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌ సముదాయం (ఐడీఓసీ) సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తున్నట్లు తెలిపారు. సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంలో...