ఖైదీలకు విద్యతోనే పునరావాసం..! BRAOU స్నాతకోత్సవంలో 10 మంది ఖైదీలకు పీజీ డిగ్రీలు
ఆర్ జె న్యూస్,వెబ్ డెస్క్ : డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) 27వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. NAAC మాజీ డైరెక్టర్, BRAOU మాజీ వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.ఎస్. ప్రసాద్ స్నాతకోత్సవ అతిథిగా పాల్గొన్నారు. ఈ స్నాతకోత్సవంలో తెలంగాణ ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ శాఖకు చెందిన 10 మంది ఖైదీలు పీజీ విద్యను విజయవంతంగా పూర్తి చేసి డిగ్రీలు అందుకోవడం ప్రత్యేకంగా నిలిచింది....