RJNEWS TELUGU
Date of Publish : 05 November 2026, 7:13 pm Posted by : RJ NEWS TELUGU

ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం!

🔸పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం: రొయ్యపల్లి మల్లేష్‌గౌడ్‌

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని 298 పూడూర్‌–కిష్టాపూర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రొయ్యపల్లి మల్లేష్‌గౌడ్‌ అన్నారు.సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 298 పూడూర్‌–కిష్టాపూర్‌ డివిజన్‌ కిష్టాపూర్‌లో నివాసముంటున్న పి.రామేశ్వరి, భిక్షపతి దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మల్లేష్‌గౌడ్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఉద్దండాపురం సత్యనారాయణ, నాయకులు రవీందర్‌రెడ్డి, శేఖర్‌గౌడ్‌, ధాత్రిక లింగం, నరేందర్‌, రంజిత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.