నల్గొండ ఉపాధ్యాయురాలి హత్యకు నిరసన. మేడ్చల్‌లో ‘శాంతి ర్యాలీ’
ఆర్.జె.న్యూస్ మేడ్చల్ : నల్గొండ జిల్లా నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి రూపా రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం TRSMA మేడ్చల్ మండల్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటించాయి. 🔸నివాళులర్పించి ర్యాలీ ర్యాలీకి ముందు స్వామి వివేకానంద, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి హతురాలు రూపా రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ఉపాధ్యాయుల...