ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి నివాళులర్పించి, పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన అసమాన త్యాగాల ఫలితమే నేటి తెలంగాణ అని అన్నారు. వారి పోరాట స్ఫూర్తితో జిల్లాను అభివృద్ధిలో...