ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి..! విధుల్లో నిర్లక్ష్యం చేస్తే శాఖాపరమైన చర్యలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : మేడ్చల్ జిల్లాలో ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. ఆయన ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమ అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్య అధికారులు, వివిధ ఆరోగ్య కార్యక్రమాల అధికారులు పాల్గొని ఆయా కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. బస్తీ, పల్లె దవాఖానాలపై దృష్టి బస్తీ, పల్లె దవాఖానాల సేవలను మరింత మెరుగుపరచాలని డా. ఆనంద్‌ సూచించారు....