మేడ్చల్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను మేడ్చల్‌లోని 297వ డివిజన్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. డివిజన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నడికొప్పు నాగరాజు (చాపరాజు) ముదిరాజ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసినివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్‌గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆధునిక భారత నిర్మాణానికి...