రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలను మూడు చింతలపల్లి మున్సిపల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేసి రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశం మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రిగా రాజీవ్‌గాంధీ అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి ఆయన ఎంతో ముందుచూపుతో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. దేశాన్ని సాంకేతికంగా, అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు...