RJNEWS TELUGU
Date of Publish : 01 October 2026, 7:20 pm Posted by : RJ NEWS TELUGU

ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం.. నిందితుడికి ఐదేళ్ల జైలు

ఆర్ జె న్యూస్,జవహర్ నగర్ : జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడిన కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.3 వేల జరిమానా విధిస్తూ మేడ్చల్‌ కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్‌ నాయమూర్తి తీర్పు వెలువరించారు. బాధిత బాలికకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

2019 జూన్‌ 22న ఘటన

2019 జూన్‌ 22న బాలిక తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా వెంకటయ్య ఆమెను ఇంటిపైకి తీసుకెళ్లి అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో పక్కనే ఉన్న వారు గమనించి నిందితుడిని బెదిరించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనపై బాలిక తల్లిదండ్రులు జవహర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితుడిపై అభియోగపత్రం దాఖలు చేశారు. కేసును విచారించిన మేడ్చల్‌ కోర్టు నిందితుడిపై నేరం రుజువైనట్లు నిర్ధారించి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. బాధిత బాలికకు రూ.50 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.ఈ కేసులో ప్రాసిక్యూషన్‌ తరఫున మేడ్చల్‌ కోర్టు స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రభాకర్ రెడ్డి వాదనలు వినిపించినట్లు తెలిపారు.