మెడినోవాలో అరుదైన వైద్య చికిత్స..! 6.2 కిలోల అండాశయ కణతి తొలగింపు
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మెడినోవా వైద్యశాలలో గురువారం అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. 58 ఏళ్ల మహిళ పొత్తికడుపులో ఉన్న 6.2 కిలోల భారీ అండాశయ కణతిని వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. మెదక్ జిల్లా గాంధారిపల్లికి చెందిన మహిళ మూడు నెలలుగా కడుపు ఉబ్బరం, అజీర్ణంతో బాధపడుతూ ఆసుపత్రిని ఆశ్రయించారు. పరీక్షలు నిర్వహించగా పొత్తికడుపులో భారీ అండాశయ కణతి ఉన్నట్లు గుర్తించారు.కణతి పొత్తికడుపు నుంచి పైభాగం వరకు విస్తరించడంతో పాటు పరిసర అవయవాలకు అంటుకుని ఉండటంతో శస్త్రచికిత్స క్లిష్టంగా మారింది. పరీక్షల్లో ఆమె గుండె...