రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ ఈటల రాజేందర్‌కు వినతి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై కౌన్సిలర్‌ నిశిత బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిశారు. కొనాయిపల్లి చౌరస్తా నుంచి కళాకల్‌ జాతీయ రహదారి–44 వరకు సీసీ బీటీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని ఎంపీని కోరారు. ఈ సందర్భంగా రహదారి పరిస్థితి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఈటల రాజేందర్‌ సానుకూలంగా స్పందించి, రహదారి నిర్మాణానికి అవసరమైన నిధుల విడుదలకు చర్యలు తీసుకుంటామని...