సరూర్‌నగర్ డివిజన్ సమస్యలపై జోనల్ కమిషనర్‌కు వినతి

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : సరూర్‌నగర్ డివిజన్ పరిధిలో నెలకొన్న పలు సమస్యల పరిష్కారం కోరుతూ జోనల్ కమిషనర్ వికాస్ మహతోను కలిసి వినతిపత్రం అందజేసినట్లు స్థానిక నేత తెలిపారు. ప్రధాన రహదారులు ఎత్తుగా ఉండటం, అంతర్గత రహదారులు పల్లంగా ఉండటంతో వర్షం కురిసిన ప్రతిసారీ నీరు నిలిచిపోతోందని, దీనికి శాశ్వత పరిష్కారంగా కొత్త అంతర్గత రహదారులు నిర్మించాలని కోరారు. అలాగే నిలిచిపోయిన అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ మైదానంలో యువత కోసం క్రీడా సదుపాయాలు...