RJNEWS TELUGU
Date of Publish : 26 September 2026, 6:15 pm Posted by : RJ NEWS TELUGU

ఔటర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : కీసర పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఔటర్‌ రింగ్‌రోడ్డుపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కీసర నుంచి శామీర్‌పేట వైపు కూలీలతో వెళ్తున్న అశోక్‌ లేలాండ్‌ వాహనం వెనుక టైరు పేలడంతో అదుపుతప్పి పల్టీలు కొట్టింది.ఈ ప్రమాదంలో చెర్లపల్లికి చెందిన మంగీలాల్‌ (60), సురేఖ (40) మృతిచెందారు. వీరిలో మంగీలాల్‌ స్వస్థలం మహబూబ్‌నగర్‌ కాగా, సురేఖ మహారాష్ట్రకు చెందినవారని పోలీసులు తెలిపారు. మరో 11 మందికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.