డ్రైనేజీ కోసం తవ్విన రోడ్డు..! ఏడాదిగా నరకయాతన
మేడ్చల్, జూలై 7 ( ఆర్ జె న్యూస్) : సెంట్రల్ డ్రైనేజీ నిర్మాణ పనుల కోసం తవ్విన రహదారిని ఏడాది గడిచినా పునరుద్ధరించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టణంలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలకు, రైల్వే స్టేషన్‌కు, పలు గ్రామాలకు అనుసంధానంగా ఉన్న ఈ ప్రధాన రహదారి ప్రస్తుతం భారీ గుంతలు, బురదతో ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి ద్వారా ప్రతిరోజూ ఎమ్మార్వో కార్యాలయం, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం, ప్రభుత్వ గ్రంథాలయం, రైల్వే స్టేషన్‌తో పాటు సమీప గ్రామాలకు వెళ్లే వేలాది మంది ప్రజలు...