మియాపూర్‌లో జెప్టో డెలివరీ బాయ్‌పై దోపిడీ: నిందితుడు అరెస్ట్
ఆర్ జె న్యూస్, హైదరాబాద్ (మియాపూర్) : రాత్రి వేళల్లో ఒంటరిగా ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఘరానా నిందితుడిని మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల మియాపూర్ పరిధిలో ఒక జెప్టో (Zepto) డెలివరీ బాయ్‌పై జరిగిన దోపిడీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ♦️ కేసు వివరాల్లోకి వెళ్తే... పోలీసుల కథనం ప్రకారం, ప్రధాన నిందితుడైన బసోడి అభిషేక్ ఒంటరిగా వెళ్తున్న జెప్టో డెలివరీ బాయ్‌ని అడ్డుకుని తీవ్రంగా బెదిరించాడు. బాధితుడి వద్ద ఉన్న రూ. 5,000 నగదును...