RJNEWS TELUGU
Date of Publish : 22 October 2026, 7:38 pm Posted by : RJ NEWS TELUGU

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న ఆర్ఆర్ ఫౌండేషన్ – కాలనీలో కరెంట్ స్తంభాలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్‌ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆర్ఆర్ ఫౌండేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు రామన్నగారి రాఘవేంద్ర గౌడ్‌ అన్నారు. మేడ్చల్‌ 297వ డివిజన్‌ పరిధిలోని శ్రీనివాస్ నగర్‌ కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న విద్యుత్‌ సమస్యను పరిష్కరించేందుకు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నూతన విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేయించారు.దివంగత వేలూరి ప్రమోద్‌ మాట ప్రకారం, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ ఫౌండేషన్‌ ప్రత్యేక చొరవ తీసుకుంది. కాలనీవాసుల ఇబ్బందులను గుర్తించి, ఇచ్చిన మాటకు కట్టుబడి నిర్ణీత సమయంలో విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు పనులను పూర్తి చేయించారు.ఈ సందర్భంగా రాఘవేంద్ర గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తమ ఫౌండేషన్‌ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ప్రజా సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడమే తమ లక్ష్యమన్నారు. రానున్న రోజుల్లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.కాలనీలో విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ ఆర్ఆర్ ఫౌండేషన్‌ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ కవిడే మహేష్‌, కటిక వినయ్‌, నరసింహారెడ్డి, రాహుల్‌తో పాటు శ్రీనివాస్ నగర్‌ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.