ప్రజా సమస్యల పరిష్కారంలో ముందున్న ఆర్ఆర్ ఫౌండేషన్ – కాలనీలో కరెంట్ స్తంభాలు
ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆర్ఆర్ ఫౌండేషన్ నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతోందని ఫౌండేషన్ అధినేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రామన్నగారి రాఘవేంద్ర గౌడ్ అన్నారు. మేడ్చల్ 297వ డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో స్థానికులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయించారు.దివంగత వేలూరి ప్రమోద్ మాట ప్రకారం, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమానికి ఆర్ఆర్ ఫౌండేషన్ ప్రత్యేక చొరవ తీసుకుంది. కాలనీవాసుల ఇబ్బందులను గుర్తించి,...