నకిలీ అగ్రిమెంట్లతో రూ.1.80 కోట్ల రియల్ ఎస్టేట్ మోసం: ప్రధాన నిందితుడు అరెస్ట్
కీసర, జూన్ 30 : రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నకిలీ పత్రాలను సృష్టించి, ఏకంగా రూ.1.80 కోట్ల మేర మోసానికి పాల్పడిన ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుంజి చిరంజీవిని కీసర పోలీసులు అరెస్ట్ చేశారు. ఏం జరిగింది? ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన, ప్రస్తుతం సనత్‌నగర్‌లో నివసిస్తున్న ఉన్నం మల్యాద్రి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. రాంపల్లి గ్రామం సర్వే నంబర్ 422లోని ప్లాట్ నంబర్లు 9, 54, 54/A, 55లకు సంబంధించి...