RJNEWS TELUGU
Date of Publish : 21 September 2026, 8:38 pm Posted by : RJ NEWS TELUGU

షామీర్‌పేటలో ఆర్టీసీ బస్సు–బైక్ ఢీ.. ఒకరి మృతి

ఆర్ జె న్యూస్, శామీర్ పేట : షామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో షాపూర్‌కు చెందిన ఓ వెల్డింగ్‌ కార్మికుడు మృతి చెందాడు. షామీర్‌పేట–సిద్దిపేట రహదారిపై అమృత్‌ చాయ్‌ సమీపంలో ఆర్టీసీ బస్సును ద్విచక్రవాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. షాపూర్‌కు చెందిన సీత రామ్ శర్మ (37), నరసింహ రావు (40) ఇద్దరూ ద్విచక్రవాహనంపై షాపూర్‌ నుంచి తుర్కపల్లికి వెల్డింగ్‌ పనుల కోసం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నగరం నుంచి సిద్దిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బైక్‌ ఢీకొట్టడంతో సీత రామ్ శర్మ తీవ్ర గాయాలై మృతి చెందినట్లు తెలిసింది. నాగేశ్వర్‌రావుకు గాయాలైనట్లు సమాచారం.సమాచారం అందుకున్న షామీర్‌పేట పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.