రాఘవేంద్రనగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

🔸గందె శ్రీనివాస్ గుప్త ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం పంపిణీ ఆర్ జె న్యూస్,మేడ్చల్‌ : మేడ్చల్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాఘవేంద్రనగర్‌ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, స్థానికులు ఉత్సాహంగా జరుపుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా గందె శ్రీనివాస్‌ గుప్త ఆధ్వర్యంలో అన్నదాన ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు, కాలనీ...