పారిశుద్ధ్య కార్మికులకు భద్రత కరువు

🔸ఎనిమిది నెలలుగా గ్లౌస్‌లు, చీపుర్లు అందడం లేదంటూ ధర్నా 🔸గుండ్లపోచంపల్లి డివిజన్‌లో కార్మికుల ఆందోళన ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : నగరం నిద్ర లేవకముందే వీధులు, రహదారులను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు కనీస భద్రతా సదుపాయాలే కరువయ్యాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన చేతి గ్లౌస్‌లు, చీపుర్లు, సబ్బులు తదితర అవసరమైన వస్తువులు గత ఎనిమిది నెలలుగా అందడం లేదని ఆరోపిస్తూ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి డివిజన్‌లో బుధవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులు ధర్నాకు దిగారు.ఈ ఆందోళనకు మేడ్చల్...