RJNEWS TELUGU
Date of Publish : 24 September 2026, 7:31 pm Posted by : RJ NEWS TELUGU

మైనర్ బాలికను రక్షించిన శశికుమార్ కు సీపీ సన్మానం

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : రెండేళ్ల మైనర్ బాలికను ప్రమాదం నుంచి ధైర్యంగా రక్షించి, నిందితుడిని పోలీసులకు పట్టించిన శశికుమార్ ను సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్ ఘనంగా సన్మానించారు.

ఆగస్టు 16న జరిగిన ఘటన..

ఆగస్టు 16న ఓ వ్యక్తి రెండేళ్ల మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నిస్తుండగా, మార్గంలో వెళ్తున్న శశికుమార్ బాలిక అరుపులు విని వెంటనే స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంఘటనా స్థలానికి చేరుకుని బాలికను సురక్షితంగా రక్షించారు. అనంతరం నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. శశికుమార్ చూపిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలను గుర్తించిన సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేశ్, ఆయనను గంగారం చెరువు వద్దకు పిలిపించి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. సమయస్ఫూర్తితో స్పందించి చిన్నారి ప్రాణాలు కాపాడటం అభినందనీయమని, శశికుమార్ చూపిన ధైర్యం, మానవత్వం సమాజంలోని ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఘటనలపై బాధ్యతాయుతంగా స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.