అంగన్‌వాడీ టీచర్‌ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన

ఆర్. జె. న్యూస్,మేడ్చల్‌ : మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలోని ఐసీడీఎస్‌ మేడ్చల్‌ ప్రాజెక్టు పరిధిలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన బుధవారం మేడ్చల్‌ సీడీపీవో కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పరిశీలన ప్రక్రియను సందర్శించి వివరాలను తెలుసుకున్నారు.అభ్యర్థులు సమర్పించిన విద్యార్హతలు, జనన తేదీ, స్థానికత, కుల ధృవపత్రాలతో పాటు ఇతర పత్రాలను అధికారులు నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించారు. ధృవపత్రాల ప్రామాణికతను నిర్ధారించేందుకు సంబంధిత శాఖల రికార్డులతో వివరాలను సరిపోల్చారు. ఈ ప్రక్రియలో డీఈఓ కార్యాలయం,...