పీసీ అండ్ పీఎన్‌డీటీ దరఖాస్తులపై పరిశీలన
🔸18 నూతన దరఖాస్తులు.. 🔸12 రెన్యువల్ దరఖాస్తుల పరిశీలన ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : గర్భస్థ శిశు లింగ నిర్ధారణను అరికట్టడంతో పాటు పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదంతో ఏర్పాటైన జిల్లా పీసీ అండ్ పీఎన్‌డీటీ సలహా కమిటీ సమావేశం శుక్రవారం అంతాయిపల్లిలోని జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ అధ్యక్షతన సమావేశం జరిగింది.అల్ట్రాసోనోగ్రఫీ కేంద్రాలు, జన్యు సలహా కేంద్రాలు,...