సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీగా గంజాయి పట్టివేత!

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కార్ పార్కింగ్ ప్రాంతంలో 21 కిలోల 499 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్టోబర్ 9, 2026న అందిన విశ్వసనీయ సమాచారంతో ఎస్‌ఓటీ మల్కాజిగిరి బృందం, గోపాలపురం పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. క్లూస్ టీమ్, స్వతంత్ర సాక్షుల సమక్షంలో చేపట్టిన తనిఖీల్లో ఇద్దరు మహిళల లగేజీలో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల ప్రెస్‌నోట్...