సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్..! గంటల తరబడి నిరీక్షించిన ప్రజలు.. నిలిచిన రిజిస్ట్రేషన్ సేవలు
మేడ్చల్ (ఆర్ జె న్యూస్) జూలై 8 : మేడ్చల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం సర్వర్ సాంకేతిక సమస్య తలెత్తడంతో రిజిస్ట్రేషన్ సేవలు గంటలపాటు నిలిచిపోయాయి. ఆస్తుల రిజిస్ట్రేషన్లు, విక్రయ ఒప్పందాలు, ఎన్‌కంబరెన్స్ సర్టిఫికెట్లు (ఈసీ) తదితర సేవల కోసం ఉదయం నుంచే కార్యాలయానికి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సర్వర్ పనిచేయకపోవడంతో టోకెన్లు తీసుకున్న వారు, ముందస్తుగా స్లాట్లు బుక్ చేసుకున్న వారి పనులు పూర్తికాక నిరాశతో వెనుదిరిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమయం, ప్రయాణ వ్యయం...