మైనర్‌పై లైంగిక దాడి.. పెళ్లి పేరుతో మోసం
ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి 17 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాలిక తరచూ జీడిమెట్లలోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వచ్చేది. ఏడాది క్రితం ఓ పండుగ సందర్భంగా స్థానిక బేకరీలో పనిచేసే చింతల్ అంబేద్కర్‌నగర్‌కు చెందిన మధు (22) తో ఆమెకు పరిచయం ఏర్పడింది. బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ మధు తరచూ ఫోన్‌లో మాట్లాడేవాడు....