‘SIR’ జాబితాలో పేరు లేదని మనస్తాపం – కారు డ్రైవర్ ఆత్మహత్య

ఆర్జేన్యూస్ స్టాఫ్ రిపోర్టర్, హైదరాబాద్, జూన్ 30 : బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని భరత్‌నగర్ లాంబా గుండు ప్రాంతంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. 'SIR' జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ కారు డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, భరత్‌నగర్‌కు చెందిన షేక్ ముజీబుర్ రెహమాన్ (51) కారు డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. 'SIR' జాబితాలో తన పేరు లేకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందేమోనని గత కొన్ని రోజులుగా ఆయన ఆందోళన చెందుతున్నాడు. తనకు...