RJNEWS TELUGU
Date of Publish : 21 July 2026, 6:47 pm Posted by : RJ NEWS TELUGU

SIR ప్రత్యేక సవరణపై కాంగ్రెస్ నేతల పరిశీలన

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్, మజీద్‌పూర్ గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాన్ని అలియాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్‌తో కలిసి కోఆర్డినేటర్ సురకంటి శ్రీకాంత్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా, ఎవరూ అన్యాయంగా తొలగించబడకుండా BLOలు, BLAలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్ సామల జశ్వంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సరసం అశోక్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ తుంకి బిక్షపతి, మాజీ సర్పంచ్ ఏళ్ల మల్లేష్, బోయిని సాయికుమార్, గోలిపల్లి నాగమళ్ల రెడ్డి, గిర్మాపూర్ నర్సింగరావు గౌడ్, అబ్బాగౌని వినోద్ గౌడ్, పల్లె అశోక్ తదితరులు పాల్గొన్నారు.