SIR ప్రత్యేక సవరణపై కాంగ్రెస్ నేతల పరిశీలన

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అలియాబాద్, మజీద్‌పూర్ గ్రామాల్లో జరుగుతున్న కార్యక్రమాన్ని అలియాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంకి రమేష్‌తో కలిసి కోఆర్డినేటర్ సురకంటి శ్రీకాంత్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో నమోదు అయ్యేలా, ఎవరూ అన్యాయంగా తొలగించబడకుండా BLOలు, BLAలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కంఠం...