RJNEWS TELUGU
Date of Publish : 16 July 2026, 6:30 pm Posted by : RJ NEWS TELUGU

SIR ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్ మను చౌదరి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణను వేగవంతం చేయాలని మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి బీఎల్‌వోలకు సూచించారు.గురువారం శామీర్‌పేట గ్రామంలో కొనసాగుతున్న SIR ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. బీఎల్‌వోలకు కేటాయించిన ఎన్యుమరేషన్ ఫారాలు, పంపిణీ చేసినవి, తిరిగి స్వీకరించిన ఫారాల సంఖ్యపై ఆరా తీశారు. సేకరించిన ఫారాల డిజిటలైజేషన్ విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.ఓటర్లకు ఫారాలు పూరించడంలో అవసరమైన సహాయాన్ని అందించి, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో శామీర్‌పేట తహసీల్దార్ సీహెచ్. శ్రీనివాస్, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.