ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా ఇంటింటికీ వెళ్లి ధ్రువపత్రాలను స్వీకరించి, వెంటనే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సూచించారు.బుధవారం కూకట్‌పల్లి మండలం ప్రగతినగర్‌ ప్రాంతంలో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్‌ మను చౌదరితో కలిసి సీఈఓ పరిశీలించారు. ఓటు నిర్ధారణ ప్రక్రియ, ధ్రువీకరణ పత్రాల స్వీకరణ, క్షేత్రస్థాయిలో సిబ్బంది పనితీరు, రికార్డుల...