మహిళల పేరుతోనే స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌: కుటుంబంలోని మహిళ పేరు మీదే భౌతిక, డిజిటల్‌ స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ మను చౌదరి అన్నారు. శనివారం శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలోని ఎస్‌ఎన్‌ఆర్‌ వేద్‌ కన్వెన్షన్‌ హాల్‌లో జిల్లా సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులకు స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజాపాలనలో భాగంగా గ్రామ, మున్సిపాలిటీ, వార్డు స్థాయిలో సభలు నిర్వహించి ప్రజల అవసరాలను తెలుసుకుని...