కొంపల్లిలో పేకాట స్థావరంపై ఎస్‌ఓటీ దాడి..!
🔸 మెదక్ డీసీసీబీ మాజీ చైర్మన్ సహా 8 మంది అరెస్టు..! 🔸రూ.3.28 లక్షల నగదు, పేకముక్కలు, సెల్‌ఫోన్లు స్వాధీనం..! మేడ్చల్ జిల్లా: కొంపల్లిలో పేకాట స్థావరంపై కుత్బుల్లాపూర్ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ఎనిమిది మందిని అరెస్టు చేశారు. పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అపర్ణ సరీనిటీ అపార్ట్‌మెంట్‌లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు ముమ్మరంగా దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ మాజీ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 🔸రెండోసారి పట్టుబడ్డారంటూ.. పేకాట...