RJNEWS TELUGU
Date of Publish : 27 August 2026, 12:48 pm Posted by : RJ NEWS TELUGU

మేడ్చల్ లో అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంపై SOT దాడి – నలుగురు అరెస్ట్

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని రాజబొల్లారం గ్రామం ఘన్‌పూర్‌ ఎక్స్‌రోడ్‌ సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఎల్‌పీజీ గ్యాస్‌ రీఫిల్లింగ్‌ కేంద్రంపై మేడ్చల్‌ ఎస్‌ఓటీ అధికారులు గురువారం రాత్రి దాడి చేశారు. ఈ సందర్భంగా విజయేందర్‌ గుప్తా, సన్నీ గుప్తా, మనీష్‌ గుప్తా, విశాల్‌ గుప్తాలను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి యజమాని రాజేష్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పెద్ద సంఖ్యలో డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్లు, ఏజిస్‌ ప్యూర్‌గ్యాస్‌కు చెందిన 15 కిలోల సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్‌ రీఫిల్లింగ్‌కు వినియోగిస్తున్న 4 మోటార్లు, వైర్‌ కనెక్షన్లు, వెయింగ్‌ మెషిన్‌, హీట్‌ మెషిన్‌ కూడా పట్టుబడ్డాయి.అలాగే భారత్‌గ్యాస్‌ హోలోగ్రామ్‌ స్టిక్కర్లు 50, హెచ్‌పీ హోలోగ్రామ్‌ స్టిక్కర్లు 47, ఇండియన్‌ గ్యాస్‌ హోలోగ్రామ్‌ స్టిక్కర్లు 27, ఖాళీ 47 కిలోల సిలిండర్లు 47, ఖాళీ 34 కిలోల సిలిండర్లు 34, ఒక అశోక్‌ లేలాండ్‌ వాహనం, మూడు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా గ్యాస్‌ రీఫిల్లింగ్‌ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.