మందుల నిల్వలపై ప్రత్యేక పర్యవేక్షణ

మెడిపల్లి యూపీహెచ్‌సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌ఓ డా. కె. ఆనంద్ ఆర్ జె న్యూస్,మేడ్చల్ : మెడిపల్లి అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌ (యూపీహెచ్‌సీ)ని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. కె. ఆనంద్‌ సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఆసుపత్రిలోని మందుల నిల్వలను తనిఖీ చేసిన ఆయన.. త్వరలో గడువు ముగియనున్న మందుల వివరాలను ప్రత్యేకంగా పరిశీలించారు. వాటి వినియోగం, స్టాక్‌ నిర్వహణలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, రోగుల హాజరు, రికార్డుల...