పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : మేడ్చల్‌ మండలం అంకిరెడ్డిపల్లిలోని శ్రీ పోచమ్మతల్లి దేవాలయంలో బోనాల పండుగ సందర్భంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జిల్లాల తిరుమల్‌రెడ్డి, కీసర మండల బీజేపీ అధ్యక్షుడు బాలరాజ్‌యాదవ్‌, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.