పేట్‌బషీరాబాద్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా శ్రీధర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ నూతన ఇన్‌స్పెక్టర్‌గా శ్రీధర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించిన విజయవర్ధన్ ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో శ్రీధర్ రెడ్డిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు మరింత...