బాచుపల్లిలో ‘తెలుగింటి కిచెన్’ ఘనంగా ప్రారంభం
ఆర్ జె న్యూస్ డెస్క్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి పరిధిలో రామకృష్ణ సరేపూడి నూతనంగా ఏర్పాటు చేసిన 'తెలుగింటి కిచెన్'ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా హన్మంత్ రెడ్డి మాట్లాడుతూ.. యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజలకు మెరుగైన సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. స్థానికంగా వ్యాపారాలు అభివృద్ధి చెందడం ప్రాంతీయ...