ఆర్టీఏ కార్యాలయంలో టెస్ట్‌డ్రైవ్‌ కారు బీభత్సం.. మాజీ ఎస్‌ఐకి తీవ్ర గాయాలు

ఆర్ జె న్యూస్, వెబ్ డెస్క్ : మేడ్చల్‌ రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయంలో టెస్ట్‌డ్రైవ్‌ కారు ప్రమాదానికి కారణమైంది. ఈ ఘటనలో మాజీ పోలీసు ఎస్‌ఐ నీలం రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. కుత్బుల్లాపూర్‌ పరిధిలోని చింతల్‌ వివేకానందనగర్‌కు చెందిన నీలం రెడ్డి తన డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ కోసం మేడ్చల్‌ ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో కార్యాలయ ప్రాంగణంలో వేగంగా దూసుకొచ్చిన టెస్ట్‌డ్రైవ్‌ కారు ఆయనను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కాలు విరిగింది. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం...