మేడ్చల్ పారిశ్రామిక వాడలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
మేడ్చల్ ఆర్ జె న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ జూలై 4 : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామికవాడ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో స్థానికంగా కలకలం రేపింది. సబ్ ఇన్స్పెక్టర్ యతీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పారిశ్రామిక వాడలోని రోడ్డు పక్కన సుమారు 40 నుండి 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతదేహం పడి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు....