అంబేద్కర్‌పై అవమానకర వ్యాఖ్యల పుస్తకాన్ని నిలిపివేయాలి

ఆర్.జె.న్యూస్, శామీర్‌పేట్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించే విధంగా ప్రచురిస్తున్న “అంబేద్కర్ కల్పిత నాయకుడు” పుస్తకాన్ని వెంటనే నిలుపుదల చేయాలని, పుస్తక ప్రచురణకర్త హమారా ప్రసాద్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ, TGSRTC SC, ST EWA, రాష్ట్ర దళిత సేన శామీర్‌పేట్ నాయకులు ఆదివారం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీస్ స్టేషన్‌లో సీఐ కి ఫిర్యాదు అందజేసి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించేలా ఉన్న...