విద్యుత్‌ సరఫరా నిలిపి.. వృద్ధురాలి మెడలోని తాళిబొట్టు చోరీ

🔸 ఇంట్లోకి చొరబడి గొలుసు లాక్కెళ్లిన దుండగుడు 🔸 రావల్‌కోల్‌లో వరుస చోరీలతో కలకలం ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట మున్సిపల్‌ పరిధిలోని రావల్‌కోల్‌ గ్రామంలో చోరీలు, చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం రాత్రి ఓ గుర్తుతెలియని వ్యక్తి ఇంటి విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి ఇంట్లోకి ప్రవేశించి వృద్ధురాలి మెడలోని తాళిబొట్టును లాక్కెళ్లాడు. రావల్‌కోల్‌కు చెందిన తరిగొప్పుల కుమారి రాజమణి (60), భర్త సత్తయ్య, వృత్తిరీత్యా కుండలు విక్రయిస్తూ జీవిస్తున్నారు. రాత్రి సమయంలో ఇంట్లో ఉన్న ఆమెను గుర్తుతెలియని వ్యక్తి లక్ష్యంగా...