RJNEWS TELUGU
Date of Publish : 15 August 2026, 6:11 pm Posted by : RJ NEWS TELUGU

మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : మహిళల్లో ప్రతిభను వెలికితీసి, వారిని ఆర్థికంగా స్వావలంబనగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా డిజిటల్ మహిళా సంఘం బజార్‌ను నిర్వహిస్తున్నట్లు డా. ఆశ్లేషా ఈదల తెలిపారు. అల్వాల్‌లోని శ్రీ సాయి గార్డెన్స్‌లో డిజిటల్ మహిళా సంఘం బజార్‌ను నిర్వహించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించడంతో పాటు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ వారికి గుర్తింపు లభించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఫ్రీడమ్‌ సేల్‌లో 100 మందికి పైగా మహిళలు స్టాల్స్‌ ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి డిజిటల్ మహిళా సంఘం బజార్‌ను నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంఎస్ సాధిక , సికింద్రాబాద్ అధ్యక్షురాలు జీవిత రెడ్డి, డీఎంఎస్ నారీ ఆశిత్వ , మల్కాజిగిరి అధ్యక్షురాలు మమత మల్లం, డీఎంఎస్ కనకధార , కొంపల్లి అధ్యక్షురాలు జయశ్రీ దుర్గ ప్రసాద్, డీఎంఎస్ ప్రగతి అధ్యక్షురాలు భవాని రవి (ఈసీఐఎల్) తదితరులు పాల్గొన్నారు.