మహిళలకు ఆర్థిక స్వావలంబనే లక్ష్యం
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : మహిళల్లో ప్రతిభను వెలికితీసి, వారిని ఆర్థికంగా స్వావలంబనగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా డిజిటల్ మహిళా సంఘం బజార్‌ను నిర్వహిస్తున్నట్లు డా. ఆశ్లేషా ఈదల తెలిపారు. అల్వాల్‌లోని శ్రీ సాయి గార్డెన్స్‌లో డిజిటల్ మహిళా సంఘం బజార్‌ను నిర్వహించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ వారికి గుర్తింపు లభించేలా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆగస్టు 15, 16 తేదీల్లో నిర్వహిస్తున్న ఫ్రీడమ్ సేల్‌లో 100 మందికి పైగా మహిళలు స్టాల్స్ ఏర్పాటు చేసి తమ ఉత్పత్తులను...