ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం : కూన శ్రీశైలం గౌడ్

ఆర్ జె న్యూస్, కుత్బుల్లాపూర్ : నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీలకు చెందిన ప్రజలు షాపూర్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి స్థానిక సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. కాలనీల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి, వీధి దీపాల ఏర్పాటు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర మౌలిక వసతుల కల్పనపై ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పలువురు కుటుంబ శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను...