ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రభుత్వం అండగా ఉంటుంది
🔸ఉప్పల్ భగాయత్‌లో ఆత్మగౌరవ భవన్‌కు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్ జె న్యూస్ వెబ్ డెస్క్ : ఆర్యవైశ్యులు సౌమ్యులు, ఆత్మాభిమానం అధికంగా ఉన్నవారని, సమాజంలో గౌరవం కోసం జీవించే మనస్తత్వం వారిదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్యవైశ్యుల్లో అనేక మంది పేదలు ఉన్నప్పటికీ ఆత్మగౌరవం కారణంగా పేదలుగా గుర్తింపు పొందేందుకు ఇష్టపడరని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్...